Tall people: ప్రపంచంలోనే అత్యధిక పొడవాటి వ్యక్తులున్న దేశం ఏదో తెలుసా?
- గత కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికా
- అమెరికా రికార్డును బద్దలు గొట్టిన నెదర్లాండ్స్
- ఇక్కడి ప్రజల సగటు ఎత్తు 184 సెంటీమీటర్లు
- కెనడాలోని లెత్‌బ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని దశాబ్ధాల వరకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికాను చెప్పేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులు ఉన్న దేశం నెదర్లాండ్స్ అవతరించింది. ఇక్కడి ప్రజల సగటు ఎత్తు 184 సెంటీమీటర్లు.. అంటే దాదాపు 6.03 అడుగులు. 18వ శతాబ్దం వరకు.. నెదర్లాండ్స్, ఐరోపాలోని చాలా దేశాలలో ప్రజల సగటు ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండేది. కానీ గత 200 ఏళ్లలో డచ్ ప్రజల ఎత్తు సగటున 15 సెంటీమీటర్లు పెరిగింది.
READ MORE: Tamil Nadu: 24 గంటల్లో రెండు రాజకీయ హత్యలు.. బీజేపీ కార్యకర్తని నరికి చంపిన దుండగులు..
Also Read
ఓ మీడియా కథనం ప్రకారం.. నెదర్లాండ్స్‌లో మహిళల సగటు ఎత్తు 168.5 సెంటీమీటర్లు (5.52 అడుగులు)లు గా ఉంది. పురుషుల సగటు ఎత్తు 184 సెంటీమీటర్ల వరకు ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. అమెరికన్లను ప్రపంచంలోనే ఎత్తైనవారిగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు నెదర్లాండ్స్ వారిని అధిగమించింది. అమెరికన్ పురుషుల సగటు ఎత్తు 177.2 సెంటీమీటర్లు (5.8 అడుగులు)లుగా ఉంది. అయితే స్త్రీల సగటు ఎత్తు 163.25 సెంటీమీటర్లు (5.3 అడుగులు)కు చేరుకుంది.
READ MORE: Manu Bhaker: మను భాకర్ కి రాష్ట్రపతి, ప్రధానితోసహా పలువురి ప్రశంసలు..
రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ప్రకారం.. 18వ శతాబ్దం వరకు, నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు పరంగా ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉండేవారిగా పరిగణించబడ్డారు. అయితే గత 200 సంవత్సరాలలో ఊహించనిది జరిగింది. నెదర్లాండ్స్ ప్రజలు అమెరికన్లను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తులు కలిగిన దేశంగా గుర్తింపుపొందింది. నెదర్లాండ్స్ ప్రజల ఔన్నత్యాన్ని అధ్యయనం చేసిన కెనడాలోని లెత్‌బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లూయిస్ బారెట్ డచ్ ప్రజల ఎత్తును పెంచడంలో జన్యుశాస్త్రం పాత్ర పోషిస్తుందన్నారు. వారు అంత ఎత్తుగా ఉండేందుకు ఆహారం, పానీయాలు, నాణ్యత వంటి అనే కీలకమని తెలిపారు. వీటి కారణంగానే.. గత కొన్ని దశాబ్దాలుగా నెదర్లాండ్స్‌లో జీవన ప్రమాణాలు మారిపోయాయని.. అంటు వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య తగ్గిందని వెల్లడించారు.
READ MORE:Gottipati Ravikumar: రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి.. లైన్మెన్ను అభినందించిన మంత్రి
ప్రొఫెసర్ లూయిస్ బారెట్ మాట్లాడుతూ.. “డచ్ ప్రజల ఎత్తు పెరగడానికి పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా దోహదపడ్డాయి. గత కొన్ని సంవత్సరాలలో, నెదర్లాండ్స్‌లో అనేక పాడి పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. పాల ఉత్పత్తులపై ప్రజల ఆధారపడటం పెరిగింది. దీని కారణంగా.. ఎముకలను బలోపేతం చేయడానికి, ఎత్తు పెరిగేందుకు కాల్షియం చాలా ముఖ్యం. ఇక్కడి ప్రజలకు కాల్షియం పుష్కలంగా ఉంది.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!