The Country of North Korea has Different Strict Rules by President Kim Jong Un
దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటు. ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దాదాపుగా మీరు వినే ఉంటారు. అక్కడ పరిస్థితులు మిగితా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. నార్త్ కొరియాలో నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరే దేశంలోనేని కఠినాతి కఠినమైన నిబంధనలు కొన్ని మనం తెలుసుకుందా..
Rule No 01. మన ప్రపంచంలో ఉన్న దేశంలో అయినా వారానికి ఆరు రోజులు పని దినాలు ఉంటాయి. అంటే ఆదివారం సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం ఆరు రోజులు పని ఉంటే ఏడవ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడికి ప్రజలు ఆరు రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగానికి వెళ్తే ఏడవ రోజు మాత్రం దేశ వాలంటీర్‌గా పని చేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో ఏడు రోజులు పని అన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్క దేశంలోని వారు మామూలుగా వారానికి 40 నుంచి 44 గంటలు అంటే రోజుకు ఏడు గంటలు పని చేస్తారు. కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం వారానికి 102 గంటలు.. అంటే రోజుకు 16 గంటలు పని చేయాలి. అలాగే కనీసం ఒక్క రోజు సెలవు కావాలి అనుకున్న కూడా వాళ్ళు అక్కడికి ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాల్సిందే. అంటే మన దేశ కరెన్సీలో లెక్కిస్తే ఒక వాన్‌కు 32రూపాయలు. కానీ వాళ్లకు నెలకు వచ్చే జీతం కేవలం 149 వాన్లు మాత్రమే. ఇక దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్క రోజు సెలవు కావాలి అనుకుంటే వారి నాలుగు నెలల జీవితాన్ని కిమ్ జాంగ్ ఉన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్టు ప్రతి రోజు పని చేయాల్సిందే.
Rule No 02. నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. అంటే అక్కడ ఏ మతాన్ని ప్రోత్సహించారు. ఏమతం వారైనా సరే కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్నే దైవంగా కొలవాలి. అలాగే కిమ్‌జాంగ్ ఉన్ సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను రెండు ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే అక్కడి ప్రజలు అతని దైవంగా భావించాలి అనే విషయాన్ని అలా చెప్పాడు అనమాట. ఇక మరొక విచిత్రమైన విశేషమేంటంటే అతని దృష్టిలో అతను పెద్ద మెజీషియన్ అనుకున్నాడో ఏమో కానీ.. అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉంది అని రాసి మరీ బుక్ పబ్లిష్ చేశాడు.
Rule No 03. మన ప్రపంచమంతా ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తుంటే నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడు అయిన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారుచేసిన జూచే అనే క్యాలెండర్‌ను పాటించాలి. ఉదాహరణకు చెప్పాలంటే… మనకు 1 జనవరి 2022 ఉంటే వాళ్లకు మాత్రం 1 జనవరి జూచే 111 ఉటుంది. ఇది ఎలా వచ్చిందంటే కిమ్ సింగ్ పుట్టింది 1912లో కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది ఒకటవ సంవత్సరం. అంటే మనకి కిమ్ జాంగ్ ఉన్ తండ్రి పుట్టి నేటికి 111 సంవత్సరాలు అన్నమాట. అంటే.. ఎలాగో దేశ నాయకుడిని దేవుడిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కించిన క్యాలెండర్ మాత్రమే ఉపయోగించాలి.
Rule No 04. మన దేశంలో రేడియో కనుమరుగై కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్‌కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది కూడా 24 గంటలు నడుస్తూనే ఉండాలి. సరే ఆన్‌లో ఉంటే ఉంది కానీ కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయా అంటే అది కూడా జరగదు. అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అంటే ఈరోజు ఎవరికి ఉరి శిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికి మాలిన వార్తలు మాత్రమే వస్తాయి. ఇలాంటి పనికిమాలిన రేడియో కేవలం ఒక్క నిమిషం ఆపిన కూడా వారికి శిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అనే రూల్ ఎందుకు పెట్టారంటే కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయినా కిమ్ సింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత అక్కడికి ప్రజలకు వార్త తెలిసింది. అయితే వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసింది అనే కోపంతో కిమ్ జాంగ్ ఉన్ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, అది కూడా ప్రతి నిమిషం నడుస్తూనే ఉండాలని రూల్ జారీచేశాడు.
Rule No 05. గూగుల్, య్యుట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి వెబ్‌సైట్, అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్‌సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. దేశ ప్రజలకి ఇంటర్‌నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్‌నెట్ ద్వారా కేవలం 28 వెబ్‌సైట్‌లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ, ల్యాప్‌టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా కిమ్ జాంగ్ ఉన్ పెట్టిన రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇంటర్‌నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండటానికి కారణం ఏంటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని. అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకి సంబంధించిన కేప్ ఆఫ్ వీడియో చూసినందుకుగాను దాదాపు ఏడుగురిని బహిరంగంగా ఉరి తీశారు. అంతేకాకుండా.. నార్త్ కొరియా దేశంలో క్షమాభిక్ష అనేది అసలు ఉండదు.