ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అందిస్తుంటాయి.కాన్సెప్ట్ బాగుండి, సరికొత్తగా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. కొన్నిసార్లు థియేటర్లలో యావరరేజ్ గా నిలిచిన చిత్రాలు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇక నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో కొన్ని మూవీస్ టాప్ ట్రెండింగ్లో నిలుస్తుంటాయి.అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ మిక్స్అప్ ఓటీటీలో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది. న్యూ ఏజ్ బోల్డ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో కమల్ కామరాజు, పూజా జావేరి, ఆదర్శ్ బాలకృష్ణ మరియు అక్షర గౌడ మెయిన్ పాత్రలు పోషించారు. వీరితోపాటు పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష సినిమాలతో పాపులర్ అయిన కామాక్షి భాస్కర్ల మరియు బిందు చంద్రమౌళి మరో రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు.
బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సినిమాగా వచ్చిన మిక్స్ అప్ చిత్రానికి ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. స్ప్రింట్ ఫిల్మ్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి అమిరెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమాకు కౌశిక్ సంగీతం అందించారు. భార్యాభర్తల మధ్య సెక్సువల్ లైఫ్, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా మార్చి 15న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. స్ట్రీమింగ్ తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.గత కొన్ని రోజులుగా ఆహా ఓటీటీలో నెంబర్ వన్ ప్లేసులో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌లో చూపించిన బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్‌తో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు ఏకంగా సినిమానే ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా చివరిగా మాత్రం మంచి సందేశం ఇచ్చారు.