Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
- రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్
- విక్రవండిలో మొదటి బహిరంగ సభ
- రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీపై తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడన్నారు. నేడు మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… ‘విజయ్‌ని రాజకీయాల్లోకి రానివ్వండి. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చారు. అలాగే విజయ్‌ని కూడా ప్రయత్నించనివ్వండి. విజయ్‌కి రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే రంగంలోకి దిగాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అయితే తమిళనాడులో విజయ్ గెలవలేడని నేను నమ్ముతున్నా. విజయం చాలా చాలా కష్టం’ అని అన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Mohanlal-AMMA: ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!
బ్లాక్‌బస్టర్ హిట్లకు కేరాఫ్ అడ్రస్ విజయ్. దళపతి విజయ్ నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇందులో కొన్ని సోషల్ మెసేజ్‌లతో వచ్చాయి. చివరిసారిగా ‘ది గోట్’ మూవీతో విజయ్ అభిమానుల ముందుకు వచ్చారు. త్వరలోనే మరో సినిమాలో దళపతి నటించనున్నారు. మరోవైపు పొలిటికల్ విషయాలను కూడా చూసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!