కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్…