TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్‌గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.
READ MORE: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Also Read
మరోవైపు.. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ప్రధాన ఆధారమని గుర్తు చేశారు. సమ్మెకు సంబంధించి 32 అంశాల్లో 29 సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. “మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక కమిటీ వేశాం, చర్చలు జరుగుతుంటే మధ్యలోనే వెళ్లిపోయిన కొందరు నాయకులు చర్చలు విఫలం అంటున్నారు. కేసీఆర్ మొన్నటి సభలో మహాలక్ష్మి పథకం గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఎలాగైనా ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలి.. తక్కువ చేసి చూపించాలి అని కుట్ర చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం మేము పని చేయిస్తున్నాం. శ్రమ దోపిడి చేసే ఉద్దేశం మాకు లేదు. మేము సిబ్బందికి, కార్మికులకు పనిభారం తగ్గించేందుకు ప్లాన్స్ చేస్తున్నాం. పాత విధానాలకు స్వస్తి పలికి పని గంటలు తగ్గించాం. కారుణ్య నియామకాలు చేపట్టాం. పేద ప్రజల లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీరం చేసే కుట్ర చేస్తే ఊరుకోం. మాకు కార్మికుల పట్ల నెగిటివ్ ఒపీనియన్ లేదు. నిధులకు సంబంధించి తాము ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తున్నాం. ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టాలని అనుకుంటున్నారు. సామరస్యంగా డిపోలలో నిరసన తెలపండి. కానీ ఈవిధంగా సమ్మెలు చేస్తే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. మా మీద జాతి వైరం ఉందా మీకు.. మేము మీ కోసం ఇంత శ్రమిస్తుంటే.. గత ప్రభుత్వం. చేపట్టిన చర్యలు మీకు గుర్తు లేదా?” అని మంత్రి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?