తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (RTC)లో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధికార యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన RTC JAC, తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు…