TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక
- తెలంగాణ ఏర్పడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ పోస్టుల భర్తీ ఇదే తొలిసారి...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టనుండగా, చాలా ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ పోస్టుల భర్తీ జరగనున్నాయి.
రాత పరీక్ష లేకుండానే:
ఈ నియామకాలలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతి (SSC)లో సాధించిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకుని.. ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం.
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. గత కొన్నేళ్లుగా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఔట్సోర్సింగ్ సిబ్బందితోనే సేవలు నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం శాశ్వత నియామకాలకు అనుమతి ఇవ్వడంతో ఉద్యోగార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నోటిఫికేషన్కు సాంకేతిక అడ్డంకి:
అయితే అధికారిక నోటిఫికేషన్ విడుదలకు ముందు ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గతంలో ఎస్ఎస్సీ బోర్డు మార్కుల విధానాన్ని అమలు చేయగా, ఆ తర్వాత కొంతకాలం GPA గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల మళ్లీ మార్కుల విధానాన్ని కొనసాగిస్తోంది. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి GPA గ్రేడింగ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేడింగ్ విధానాన్ని మార్కుల శాతంగా ఎలా మార్చాలి? రెండు విధానాల అభ్యర్థులను సమానంగా ఎలా అంచనా వేయాలి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు ఎస్ఎస్సీ బోర్డుకు లేఖ రాశారు.
క్లారిటీ కోసం ఎదురుచూపు:
గ్రేడింగ్ విధానాన్ని మార్కుల శాతంగా మార్చే ప్రక్రియపై ఎస్ఎస్సీ బోర్డు నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..