గ్రూప్-1 అభ్యర్థుల నియామకంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పరీక్షపై టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
READ MORE: Ranveer Allahbadia: రణ్‌వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట.. పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశాలు..
కాగా.. తెలంగాణలో గ్రూప్ 1న నియామకాలు సందిగ్ధంలో పడ్డాయి. గ్రూప్1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 19మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించారు. రెండు సెంటర్లలో పరీక్షలు రాసిన వారే ఎక్కువగా ఎంపిక కావడంపై 20మంది అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. వారికి నియామక పత్రాలను మాత్రం తుది తీర్పు తర్వాత అందించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
READ MORE: Virat Kohli: రివెంజ్ దెబ్బ అదుర్స్ కదూ.. కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్లి కోహ్లీ ఇచ్చిపడేశాడుగా!