Virat Kohli: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆప్స్ స్థానాల కోసం నువ్వా.. నేనా.. అన్నట్లుగా ప్రతి జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతానికి సగం పైగా సీజన్ ముగిసింది. ఎప్పుడు లేని విధంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ చేరుకోవడంతో అభిమానుల్లో పట్టరాని సంతోషం కనబడుతోంది. ఇకపోతే, ప్రస్తుతం సీజన్ లో రివెంజ్ వీక్ నడుస్తోంది. ఈ వారం ఏ జట్టుకు కలిసి వచ్చిందో తెలియదు కానీ.. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీకి మాత్రం బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. ఈ రివెంజ్ వీక్ ను మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అసలు ఎందుకు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారన్న విషయాన్ని వస్తే.. ఆర్సీబీని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓడించిన కింగ్స్ పంజాబ్ కు వారి సొంత గ్రౌండ్ లోనే గెలిచి బదులిచ్చారు ఆర్సీబీ ఆటగాళ్లు. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో.. మ్యాచ్ అనంతరం ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ చేసిన కాంతారా సెలబ్రేషన్స్ అందరికీ తెలిసిందే. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత గ్రౌండ్ లో తన సహచరులతో మాట్లాడుతున్న కేఎల్ రాహుల్ దగ్గరికి కోహ్లీ ఫన్నీగా కాంతారావు సీన్ ను రీ క్రియేట్ చేశారు.
Kohli mocking Kl Rahul about his celebration 😭😭 pic.twitter.com/7h4mPsJ65A
— Ayush. (@OneKohli) April 27, 2025
బెంగళూరులో వన్ మ్యాన్ షో తో అదరగొట్టిన కేఎల్ రాహుల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ఎమోషనల్ గా కాంతారా స్టైల్ లో.. ఈ గ్రౌండ్ నాది అన్నట్లుగా సెలబ్రేషన్ చేశాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా విరాట్ కోహ్లీ తన హోమ్ గ్రౌండ్ లో అదరగొట్టి వారికి రివెంజ్ ఇస్తాడని భావించిన అభిమానులకు, విరాట్ కోహ్లీ అది పూర్తిగా నెరవేర్చాడు. ఢిల్లీలో తన సొంత గ్రౌండ్ లో తన ప్రతాపం చూపించి విజయానికి అవసరమైన పరుగులు చేయడంలో తనవంతు పాత్ర పోషించి అభిమానులకు గిఫ్ట్ అందించాడు. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపలికి వచ్చి కేఎల్ రాహుల్ సీన్ ను అతని ముందే రీ క్రియేట్ చేసిన అనంతరం కోహ్లీ నవ్వుతూ హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఆర్సీబీ పది మ్యాచ్లో ఏడు మ్యాచులలో గెలిచి, మూడు మ్యాచ్ లలో ఓడిపోయి టాప్ ప్లేస్ లో ఉంది.