నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇప్పటికే గ్రూప్స్, డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోసారి పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీఎస్సీకి అర్హత సాధించాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఇప్పటికే వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అప్లై చేసుకోని వారికి బిగ్ అలర్ట్. తెలంగాణలో రేపటితో అంటే ఏప్రిల్ 30తో టెట్ దరఖాస్తు గడువు ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 మధ్య నిర్వహించనున్నారు.
పేపర్ I కు 38,068 దరఖాస్తులు వచ్చాయి.
పేపర్ II కు 82,433 దరఖాస్తులు వచ్చాయి.
రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్న వారు 13,510
ఈ రోజు వరకు వచ్చిన దరఖాస్తులు మొత్తం 1,34,011
పరీక్ష వివరాలు
ఈసారి టెట్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ మోడ్ లో నిర్వహించనున్నారు. అంటే అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రాయాల్సి ఉంటుంది.
టెట్‌లో రెండు పేపర్లు
పేపర్ 1: ప్రాథమిక స్థాయి టీచర్ల (Class 1 to 5) కోసం.
పేపర్ 2: ప్రాథమికోన్నత స్థాయి టీచర్ల (Class 6 to 8) కోసం.
అభ్యర్థులు ఒక్క పేపరుకి గానూ రూ. 750 ఫీజు చెల్లించాలి.
రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి.
ఫలితాల విడుదల
తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.