తెలంగాణలో లా సెట్,పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఓయూ విసి కుమార్, కన్వీనర్ విజయ లక్ష్మి పలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 66.46 శాతం క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. 57 వేల 715 మంది రిజిస్టర్ చేసుకోగా 45 వేల 609 మంది పరీక్షకు హాజరయ్యారు. 30 వేల 311 మంది అర్హత సాధించారు. లా సెట్ రాసిన వారిలో బి కామ్, బి టెక్ చేసిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం.
Also Read:Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
లా కాలేజీల్లో మొత్తం సీట్లు 9,388.. గత ఏడాది భర్తీ అయినవి… 8,631 సీట్లు. ఈ ఏడాది లా లో సీట్లు పెరగనున్నాయి. శాతవాహన, పాలమూరు యూనివర్సిటీలో ఈ సారి లా కోర్సు ప్రారంభం కానుంది. జూన్ 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.