Minister TG Bharath: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్.. స్పెషల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
- పరిశ్రమలు.. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్
- స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంది
- స్పెషల్ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని సీఎంను కోరతా
- నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు టీజీ భరత్.. మొదట సచివాలయంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు అధికారులు.. 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ స్పెషల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉందని పేర్కొన్నారు.. అయితే, స్పెషల్ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు, నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.. రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు.
Read Also: Viswambhara: విశ్వంభర సెట్స్ లో మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి
Also Read
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
ఇక, గుజరాత్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు మంత్రి టీజీ భరత్.. గతంలో లా మాయా బజార్ సమాచారం ఉండదన్న ఆయన.. రాయితీలు అందక పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే, పరిశ్రమలకు అందాల్సిన రాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను అన్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్న ఆయన.. ఒక్క ప్రాంతం అభివృద్ధిమాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాం అన్నారు. స్నేహ పూర్వక వాతావరణంలో అద్భుతాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు. మరోవైపు.. మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్కకు వెళ్లి పోయాయి.. 2019 నుండి 2024 వరకు పెట్టుబడులు ప్రకటనల వరకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.. అలా ఎందుకు జరిగిందో కూడా చూడాలన్నారు మంత్రి టీజీ భరత్.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..