Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి
- కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత.
- కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణ
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలను విసిరిన కాంగ్రెస్ నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: నేడు జరుగుతున్న కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సభ కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మీ హయాంలో ఏమి చేయలేదని, మా ప్రభుత్వం అన్ని చేస్తోంది” అని కాంగ్రెస్ నాయకులు అనడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల దాడికి ప్రతిగా బిఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసరడం ప్రారంభించారు. ఇరువర్గాలు ఒకదానికొకటి నినాదాలు చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ ఘర్షణతో గ్రామసభ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది.
Also Read: MLA House Arrest: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్టు
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ఇక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఘటన స్థలానికి భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను శాంతింపజేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. గ్రామసభలు ప్రజాసమస్యలను చర్చించడానికి ఉండాల్సి ఉంటే, ఇలాంటి రాజకీయ ఘర్షణలతో అభివృద్ధి అడ్డంకులు ఎదుర్కొంటోంది. స్థానికులు గ్రామసభలో జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్వేగభరిత ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!