టెక్నాలజీ ఎంత పెరిగినా.. సమాజంలో ఎన్నిమార్పులు చోటుచేసుకుంటున్నా కొన్ని మూఢ నమ్మకాలు, సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో జరిగిన ఓ ఘటన సంచలనం కలిగించింది. కన్యాకుమారిలో చిన్నారిని నరబలికి ప్రయత్నించారు. చనిపోయిన భార్య ,కూతురి ఆత్మ శాంతించాలని నరబలికి పూజారి ఏర్పాట్లు చేశారు. రెండేళ్ల చిన్నారి కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లితండ్రులు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు గంటలలో చిన్నారిని కాపాడారు పోలీసులు.
కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్ లో ఈ ఘటన జరిగింది. నాగర్ కోవిల్ కి చెందిన కన్నన్ , అఖిల భార్య భర్తలు. తమ ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి అదృశ్యం అయింది. ఆ చిన్నారి కోసం గాలించారు. కానీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. చిన్నారి ఆచూకీకోసం రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటి పక్కనే ఉన్న బావిలో పడిపోయి ఉంటుందని బావిలో దిగి వెతికారు పోలీసులు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేప్పట్టిన పోలీసులు. ఈ క్రమంలో చిన్నారి ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరటి తోటలో వింత శబ్దాలు రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు.
Read Also: Priyadarshi: పల్లెటూరు పాట మన ఊరిని గుర్తు చేసేలా ఉంది…
పోలీసులు తనిఖీ చేయగా విభ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. పూజారి రాసప్పన్ బాగోతం వెల్లడైంది. చనిపోయిన తన భార్య , కూతురి ఆత్మ శాంతికోసం చిన్నారిని నరబలి ఇవ్వడానికి ప్రయత్నించినట్టు పోలీస్ విచారణ లో వెల్లడయింది. పూజారిని అరెస్ట్ చేసి, చిన్నారిని తల్లితండ్రులకి అప్పగించారు పోలీసులు. చిన్నారి క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: IT Layoffs Live: ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. ఊడుతున్న ఉద్యోగాలు