Site icon NTV Telugu

TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు

Vishwaprasad News

Vishwaprasad News

TG Vishwa Prasad: ప్రస్తుతం సినీ నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ మన తెలుగు సినీ కార్మికులలో టాలెంట్ లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఫిలిం ఫెడరేషన్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్మాతలలో పలువురు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపద్యంలో టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా స్పందించారు.

READ MORE: Trump Tariffs: ట్రంప్‌ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..? సంచలన విషయాలు..!

తెలుగు సినిమా పరిశ్రమ, హైదరాబాద్ ప్రతిభ, ఎంట్రీ ఫీజులపై నా స్పష్టమైన అభిప్రాయం ఇదే అంటూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు. హైదరాబాద్ టాలెంట్ గురించి ఆయన పేర్కొంటూ హైదరాబాద్లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో, Including మా ప్రొడక్షన్లలో, సుమారు 60% నుండి 70% వరకు పని చేసే బృందం హైదరాబాద్ నుంచే వస్తోంది. వీరి పాత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకం అని అన్నారు. ఎంట్రీ బారియర్స్ & స్కిల్ గ్యాప్ గురించి ఆయన పేర్కొంటూ గతంలో 10% ఉన్న స్కిల్ గ్యాప్ ఇప్పుడు 40% దాకా పెరగడం కేవలం ప్రతిభ ఒక్కటే లేకపోవడం కాదు.. అసలు కారణం కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పరిశ్రమలోకి రానివ్వకుండా ₹5-₹7 లక్షల వరకు అక్రమంగా డిమాండ్ చేసే గ్రూపుల వల్ల. నిజమైన టాలెంట్, స్కిల్ ఉన్న వాళ్లకు ఇది ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇవి కృత్రిమ అడ్డంకులు అని అన్నారు. ఇండస్ట్రీ అనుబంధం విశ్వ ప్రసాద్ పేర్కొంటూ ఇండస్ట్రీతో అనుబంధం అనే దానిపై నేను ప్రత్యేకంగా మాట్లాడటానికి కారణం.. కొత్త ప్రతిభ రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తూ, కేవలం తమ సొంత లాభాల కోసం వ్యవస్థను నియంత్రించే గ్రూపులపై. ఇది పరిశ్రమ లాంగ్ జర్నీలో కూడా చాలా నష్టదాయకం అని అన్నారు.

READ MORE: Zomato CEO Post: ఆ నిర్ణయమే ఏకైక మార్గం.. ట్రంప్ టారిఫ్‌పై జొమాటో సీఈఓ షాకింగ్ పోస్ట్..

ఇక లోకల్ టాలెంట్కి మద్దతు గురించి ఆయన పేర్కొంటూ ఇప్పటికే మేజార్టీ టీం హైదరాబాద్ నుంచే వస్తోంది. మిగిలిన గ్యాప్ కూడా ఇక్కడి ప్రతిభతోనే నింపాలి. అవకాశాలు కల్పించాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి. బాహ్య నియామకాలపై ఆధారపడకుండా, ఇక్కడి టాలెంట్ కే మద్దతుగా ఉండాలి అని అన్నారు. ఇక తన వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ గురించి క్లారిఫికేషన్ (స్పష్టత) ఇస్తూ నేను హైదరాబాద్ టాలెంట్ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు అని అన్నారు. హైదరాబాద్లో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పట్నుంచో అండగా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలి.. మెరిట్క ప్రాధాన్యం ఇవ్వాలి.. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలి.. వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన బాధ్యత. ఇదే మన పరిశ్రమ భవిష్యత్తుకు అవసరం అని ఆయన అన్నారు.

READ MORE: Tariff Impact iphone Price: ట్రంప్ 50 శాతం టారిఫ్.. ఐఫోన్‌లు మరింత కాస్ల్టీగా మారుతాయా?.. భారత్ లో ప్రభావం ఎంత?

Exit mobile version