TG Vishwa Prasad: ప్రస్తుతం సినీ నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ మన తెలుగు సినీ కార్మికులలో టాలెంట్ లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఫిలిం ఫెడరేషన్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్మాతలలో పలువురు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపద్యంలో టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా స్పందించారు.
తెలుగు సినీ పరిశ్రమలో 30% వేతనాల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ వివాదం పరిష్కారం కోసం లేబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఎన్టీవీతో కీలక ప్రకటనలు చేశారు. సినీ కార్మికుల ఫెడరేషన్ ఈ విషయంపై తమను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2022లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత, మూడేళ్ల వ్యవధిలో 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం సినీ…
సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్ తరపున యూనియన్ సభ్యులందరూ కలిసి 30% వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2022లో చివరిగా వేతనాలు పెంచారు. ఆ తర్వాత మూడేళ్ల తరువాత ఈ వేతనాల పెంపు ఉండేలా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ నష్టాలలో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మాత్రం ఆ పెంపుకు సుముఖంగా లేరు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కేవలం పెంచిన వారి షూటింగ్స్‌కి…
తమకు వేతనాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తరపున అన్ని యూనియన్ నాయకులు తెలుగు సినీ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలివిగా బంద్ అని ప్రకటించకుండా వేతనాలు పెంచిన వారి షూటింగ్స్‌కి మాత్రమే వెళతామని వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం సరికాదని లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లిన ఫిల్మ్ ఛాంబర్ సహా నిర్మాతల మండలి సభ్యులు ఇప్పటికే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు…