Zomato CEO Deepinder Goyal’s Shocking Post: ఇటీవల భారత దిగుమతులపై అమెరికా 50శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయంపై భారతీయ వ్యాపార దిగ్గజాలు, సీఈఓలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు.
READ MORE: Gas Cylinder Blast: విశాఖలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..!
కీలక వ్యాఖ్యలు చేసిన దీపిందర్ గోయల్..
‘‘ఈ ప్రపంచంలో కాలం ఎప్పటికప్పుడు మన స్థానమేంటో గుర్తుచేస్తుంటుంది. ప్రస్తుతం టారిఫ్‌ల రూపంలో మనముందు ఓ బెడద ఉంది. ఇలాంటివి మనకు ఎన్ని ఎదురైనా..మనపని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి. మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోకపోతే.. ప్రపంచ శక్తులు మనల్ని బెదిరించాలని చూస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణపరంగా మరీ ముఖ్యంగా మన ఆశయాల్లో సమష్టిగా సూపర్‌పవర్‌గా అవతరించాలని నిర్ణయించుకోవడమే అందుకు ఏకైక మార్గం’’ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మిత్ర దేశం అంటూనే భారత్‌పై 50శాతం టారిఫ్‌లు విధించిన అగ్రరాజ్యంపై నెట్టిజన్లు మండిపడుతున్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.