ఈ వారం దాదాపుగా 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం కాస్త నోటెడ్గా ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాంచ్ మినార్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అతని గత సినిమాలతో పోలిస్తే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఎందుకు ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కనబడటం లేదు? ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే సినిమాతో పాటు అల్లరి నరేష్ హీరోగా నటించిన 12 ఏ రైల్వే కాలనీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటితో పాటు పెద్దగా ప్రమోషన్ లేకుండానే రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read :Prabhas: పెద్ద ప్లానింగే.. ప్రభాస్ ‘ప్రీక్వెల్’ ఫిక్సా?
డైరెక్టర్ వేణు ఉడుగుల నిర్మాతగా మారి ఈ సినిమాని నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ఈ సినిమా మిగతా పెద్ద హీరోల సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి, కలెక్షన్స్ విషయంలో ముందుకు దూసుకుపోతోంది. నిజానికి, ఈ సినిమా మీద కూడా మిశ్రమ స్పందన వచ్చింది. క్లైమాక్స్ తప్ప ఏమీ లేదని చాలామంది అంటుంటే, సినిమా బాగుందని, ఫీల్ గుడ్ సినిమా అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా, టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. రాజ్ తరుణ్, అల్లరి నరేష్, ప్రియదర్శి లాంటి ఎస్టాబ్లిష్డ్ హీరోలతో పోటీ పడుతూ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.