రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్ కు పోటీగా రోజురోజుకీ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. టెలిగ్రామ్ యూజర్స్ కోసం సరికొత్త సేవలను పరిచయం చేస్తూ వారిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇక ఆ ఫీచర్ విషయానికి వస్తే..
Also Read: Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!
కాస్త వాట్సప్ బిజినెస్ అకౌంటు లాగే.. తాజాగా టెలిగ్రామ్ కూడా కంపెనీలు వారి కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్ ను మెరుగుపరిచే ఉద్దేశంతో సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. కస్టమర్స్ కు సమాధానాలు ఇవ్వడానికి క్విక్ రిప్లై, గ్రీటింగ్ మెసేజ్ లు, ఇలాంటి కొన్ని ఆప్షన్లను తాజాగా టెలిగ్రామ్ విడుదల చేసింది.
Also Read: Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!
కాకపోతే ఈ కొత్త ఫీచర్ లో మాత్రం కేవలం ప్రీమియం యూజర్స్ కు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రీమియం యూజర్లు ఈ ఫీచర్లను ఉచితంగానే వాడుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా కంపెనీలో తమ ఛానల్ కు కస్టమర్ మొదటిసారిగా కనెక్ట్ అయిన సమయంలో వారికి శుభాకాంక్షలు, ఆటో రిప్లై మెసేజ్లను పంపించవచ్చు. దానికి అనుగుణంగా ఆటోమేటిక్ గా మెసేజ్ ను చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటితోపాటు క్విక్ రిప్లైస్ ఫీచర్ ప్రీసెట్ రిప్లై చాట్‌ను అందిస్తుంది. అలాగే యూజర్లు తమ వ్యక్తిగత ఖాతాలను బిజినెస్ ఖాతాలా బదిలీ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయం సంబంధించి తాజాగా టెలిగ్రామ్ సీఈవో ప్రకటనలను విడుదల చేశారు. ముందుముందు సరికొత్త ఫీచర్లను తీసుకురాబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు.