ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. వాళ్ళు చెప్పినవి మమ్మల్ని చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. తాము చెప్పినవి చేస్తామని.. 7.50 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది అని అప్పుడు మాట్లాడి ఇప్పుడు మూడున్నర లక్ష కొట్లే ఉన్నాయని అనుకున్నా అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
READ MORE: Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్‌లను కొనలేము..
“నిన్న డిల్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల విషయంలో చేతులు ఎత్తేశారు… వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు… వాళ్ళకి ప్రజలు జవాబు చెబుతారు… తెలంగాణ లో, దక్షిణాది లో ఒక్క పార్లమెంట్ సీట్ తగ్గదు.. జనాభా తగ్గిన సీట్లు తగ్గవు… స్టాలిన్, రేవంత్ లవి బోగస్ మాటలు.. తమిళం గురుంచి స్టాలిన్ చేసింది ఏమీ లేదు. ఎవరినైనా హింది నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా? మాతృ భాషలోనే ఆప్పర్ ప్రైమరీ వరకు బోధన ఉండాలని మేము కోరుకుంటున్నాం.” అని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!