Telangana Weather Update: తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది అక్టోబర్ 1 నాటికి అల్పపీడనంగా మారే…