నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు వైవిఎస్ చౌదరి. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరితో పాటు లోకేశ్వరి, పురంధేశ్వరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే..
Also Read : Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..
ఇది 1980 నేపథ్యంలో సాగే స్టోరీ అంటా. తెలుగు భాషకు పెద్దపీట వేస్తూ.. హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ఈ మూవీలో చూపించనున్నట్లు వై.వి.ఎస్ చౌదరి తెలిపారు. అలాగే ఈ మూవీకి నేపథ్యమే బలమని తెలిపారు. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది. ఎంత సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చేటప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే అంత ఈజీ కాదు. చాలా కష్ట పడాలి. మరి తారక రామారావు ఎంత వరకు గుర్తింపు చేసుకుంటారో చూడాలి.