Site icon NTV Telugu

TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్.. 20 శాతం పెరిగిన బస్ పాస్ రేట్లు

Tgs Rtc

Tgs Rtc

TGSRTC : తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.

Badshah : ఆమెతో పిల్లల్ని కంటా బ్రో.. నోరుజారిన స్టార్ సింగర్

పెరిగిన పాస్ చార్జీలు ప్రకారం.. గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్, ఇప్పుడు రూ.1,800గా అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్టు అధికారిక సమాచారం.

ఈ పెంపుతో సామాన్య ప్రజానీకానికి రవాణా ఖర్చులు అధికమవుతాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ బస్సుల్లో ప్రయాణించే వారు ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. మరింతగా ప్రభుత్వ వివరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Pakistan Girl: జీన్స్‌లో కనిపించిన అమ్మాయిని చూసి గుబులు పట్టిన పాకిస్థాన్ వీధులు..!

Exit mobile version