పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనాల్లో తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ…
TGSRTC : తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.…
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుడు బెంబేలెత్తుతున్నాడు. పెట్రోల్, డీజల్, కూరగాయలు, పప్పుధ్యానాలు, సుమారు రూ.200లకు మించి ఏది తక్కువగా ఉండటం లేదు. ప్రతీదీ విపరీతంగా పెరగటంతో ప్రతి ఒక్కరికి భారంగా మారింది. ఏది కొన్నాలన్న, ఏది తినాలన్న, ఎక్కడి ప్రయాణించాలన్న తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రూ. 500 నోటు ఇప్పుడు రూ5 గా.. ఖర్చైపోతుండటంతో సామాన్యులకు భారమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ కొనాలంటే…