CM Revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం దోహదపడుతోందని గవర్నర్ పేర్కొన్నారు. సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. పెట్టుబడులు, ఉపాధి, ఇన్నోవేషన్ ప్రధాన లక్ష్యంగా 27 అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు.
Krithi Shetty: హోటల్ రూమ్‌లో ఆత్మను చూశా..షాకింగ్ విషయం బయట పెట్టిన కృతిశెట్టి
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణ భవిష్యత్ విజన్‌ను స్పష్టంగా వివరించారు. దేశ భవిష్యత్ కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాతల దృష్టిని గౌరవించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలే తెలంగాణ అభివృద్ధి మార్గదర్శకాలని ఆయన అన్నారు. విడిపోయిన తర్వాత ప్రజా పోరాటంతో సాధించిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ 2014లో సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారత పటంలో చోటు చేసుకుందని గుర్తు చేశారు. గత దశాబ్దంలో రాష్ట్రం అత్యధిక అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగిందన్నారు.
రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుతో ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ను సిద్ధం చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ డాక్యుమెంట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపొందించబడిందని, ISB, నితి ఆయోగ్, నిపుణుల సూచనలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ జనాభాలో 2.9 శాతమే ఉన్నా.. దేశ GDPలో 5 శాతం వాటా సాధించిన తెలంగాణ 2047 నాటికి దాన్ని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
Minister Anita: విద్యార్థినికి న్యాయం చేస్తాం.. మహిళల రక్షణే మా లక్ష్యం..!
రాష్ట్ర అభివృద్ధి కోసం మొదటిసారి క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్ల అభివృద్ధి మోడల్‌ను అమలు చేస్తున్నామన్నారు. చైనా గ్వాంగ్డాంగ్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకొని.. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల పోటీ స్థాయికి తెలంగాణను తీసుకెళ్లే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు కీలక భాగస్వాములని.. వారికి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నట్లు సీఎం అన్నారు. “కష్టం అయితే వెంటనే చేయండి.. అసాధ్యమైతే డెడ్‌లైన్ పెంచుతాం” అని సందేశం ఇచ్చారు. “తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్” అంటూ రాష్ట్ర ఎదుగుదలను ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.