Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
- వియత్నాం విద్యా విధానంపై తెలంగాణ అధికారుల అధ్యయనం
- ప్రభుత్వ పాఠశాలలకే అత్యధిక ప్రాధాన్యం
- ఏఐ, డిజిటల్ విద్యతో ఆధునిక బోధన
- కంఠస్థానికి బదులు ఆలోచనా నైపుణ్యాలకు ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వియత్నాం విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అధికారుల బృందం వియత్నాంలో పర్యటించింది. జాయింట్ డైరెక్టర్ బి. వెంకట నరసమ్మ నేతృత్వంలో సాగిన ఈ పర్యటనలో ఆ దేశ విద్యావిధానం, బోధనా పద్ధతులు, డిజిటల్ విద్య అమలు తీరు వంటి పలు కీలక అంశాలపై లోతైన అధ్యయనం జరిగింది.
తప్పనిసరి విద్య.. క్రమబద్ధమైన విద్యా వ్యవస్థ
వియత్నాంలో పాఠశాల విద్య ఆరేళ్ల వయస్సు నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి విద్యా విధానం ప్రకారం ప్రాథమిక విద్య 1 నుంచి 5వ తరగతి వరకు, దిగువ మాధ్యమిక విద్య 6 నుంచి 9వ తరగతి వరకు, ఉన్నత మాధ్యమిక విద్య 10 నుంచి 12వ తరగతి వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక , దిగువ మాధ్యమిక విద్యను అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. విద్యార్థుల నమోదు, హాజరుతో పాటు చదువు మధ్యలో మానేయకుండా చూడటంపై ప్రత్యేక యంత్రాంగం నిరంతరం దృష్టి సారిస్తుంది.
Also Read
- TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ప్రభుత్వ పాఠశాలలదే సింహభాగం
మన దేశానికి భిన్నంగా వియత్నాంలో ప్రభుత్వ పాఠశాలలదే ప్రధాన పాత్ర కావడం విశేషం. ప్రాథమిక స్థాయిలో ఏకంగా 99 శాతం పాఠశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుండగా, ప్రైవేటు పాఠశాలలు కేవలం 1 శాతంగా మాత్రమే ఉన్నాయి. ఉన్నత మాధ్యమిక స్థాయిలోనూ ప్రైవేటు విద్య 6 శాతాన్ని మించకపోవడం గమనార్హం. దీనిని బట్టి ప్రభుత్వ పాఠశాలల ద్వారానే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ సంకల్పం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
కృత్రిమ మేధస్సు (AI) , డిజిటల్ విద్యకు పెద్దపీఠం
నేటి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా వియత్నాం తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయులకు ల్యాప్‌టాప్‌లు, ఇతర సాంకేతిక వనరులను అందుబాటులో ఉంచారు. బోధనలో కృత్రిమ మేధస్సు (AI) , డిజిటల్ విద్యను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయికి చేరేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై ఆ దేశం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
విద్యార్థుల్లో ఐదు ప్రధాన లక్షణాల అభివృద్ధి
కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేలా వియత్నాం కరిక్యులమ్ రూపొందించబడింది. ముఖ్యంగా విద్యార్థుల్లో స్నేహపూర్వకంగా ఉండటం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, సృజనాత్మకత అనే ఐదు ప్రధాన లక్షణాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలాగే మొదటి తరగతి నుంచే శారీరక విద్య, సంగీతం, చిత్రకళను పాఠ్యప్రణాళికలో భాగం చేశారు. విద్యార్థులకు ఈత నేర్పించడం, తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
కంఠస్థ విద్యకు స్వస్తి.. ఆలోచనా విధానానికి ప్రాధాన్యత
అక్కడ బోధనా పద్ధతులు పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతంగా సాగుతాయి. గ్రూప్ చర్చలు, సమూహ కార్యక్రమాలు, పరస్పర అభ్యాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులు తరగతి గది కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. కంఠస్థ విద్యకు పూర్తిగా స్వస్తి పలికి, స్వతంత్రంగా ఆలోచించడం, సమస్యలను తమంతట తాముగా పరిష్కరించుకునే నైపుణ్యాలను చిన్ననాటి నుంచే అలవాటు చేస్తున్నారు. ఇక బోధనా భాష విషయానికి వస్తే ప్రధానంగా వియత్నామీస్ భాషలోనే బోధన సాగుతుంది. గిరిజన ప్రాంతాల్లో మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే, మూడో తరగతి నుంచి ఆంగ్ల భాషా బోధనను ప్రారంభిస్తున్నారు.
తెలంగాణ విద్యావ్యవస్థకు మార్గదర్శకం
వియత్నాం పర్యటనలో గుర్తించిన ఈ కీలక అంశాలు మన రాష్ట్ర విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విద్యతో పాటు AI వినియోగం, ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ, విద్యార్థుల్లో నైతిక విలువలు , జీవిత నైపుణ్యాల పెంపొందించడం వంటి అంశాలను మన రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా ఈ అధ్యయనం ఉపయోగపడనుంది.
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..