Municipal Elections: నేడే మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.. బుజ్జగింపులు షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Municipal Elections: నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దీంతో పట్టణాలలో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను భారీగా 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య ఎన్నికలపై పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైన అనంతరం మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. దీంతో పోటీకి నిలిచే అభ్యర్థుల తుది చిత్రం స్పష్టమవడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది.
READ MORE: Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
కాగా.. కొన్ని పార్టీలు ఇంకా కొన్ని వార్డుల్లో బిఫారాలు అందించలేదు. నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల అధికారులకు బిఫారాల అందజేతకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి గడువు. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. బిఫారాలు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో బిఫారం దక్కని వారు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా స్వతంత్రులుగా పోటీలో ఉంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పలుచోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక బుజ్జగింపులు మొదలవుతాయి. రెబల్ అభ్యర్థులను తప్పించేందుకు అనేక కీలక మీటింగ్‌లు, హామీలతో అగ్రనేతలు బిజీ బిజీగా ఉంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..