IMD Report: తెలంగాణలో ఈ రుతుపవనాల సీజన్ లో ఆశించిన మేర వర్షాలు పడడం లేదని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఆగస్టు రెండో వారం వరకు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్షాల సూచనలు లేవని వెల్లడించింది. అంటే, మరో ఇరవై రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశాలు కనిపించడం లేదని ఐఎండీ హెచ్చరించింది.
Read Also:iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో పై ఏకంగా రూ.19,701 భారీ డిస్కౌంట్..!
అయితే, కొన్ని జిల్లాల్లో తక్కువ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన వర్షాల కోసం మరింత సమయం ఎదురుచూడాల్సిందేనని వెల్లడించింది. రుతుపవనాల సమయంలో సాధారణంగా వచ్చే అల్పపీడనాలు గత నెల నుంచి ఏర్పడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని ఐఎండీ పేర్కొంది. ఇందులో భాగంగానే.. జూన్ నెలలో రాష్ట్రంలో 28% వర్షపాతం లోటు నమోదు కాగా.. జులై నెలలో ఇప్పటి వరకు 13% వర్షపాతం లోటు నమోదైందని ఐఎండీ గణాంకాలను వెల్లడించింది. ఇది వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపే అంశం కావడంతో రైతులలో ఆందోళన పెరుగుతోంది.
Read Also:SANJAY DUTT : సౌత్ సినిమాలపై సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు..
వర్షాభావం కారణంగా ఇప్పటికే పంటల సాగు ఆలస్యమవుతోంది. పెద్దగా వర్షాలు లేకపోవడం వల్ల రైతులు విత్తనాలు వేయడానికే వెనుకాడుతున్నారు. వర్షాలు త్వరగా రాకపోతే, ఈ ఖరీఫ్ సీజన్ దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి.