రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కోతలను అధిగమించి అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ పారిశ్రామిక సేవా వ్యాపార రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనికతతో విద్యుత్ ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించుటకు అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2014లో ఉన్న 7778 MW విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యాన్ని , 2023 నాటికి 18567 MW లకు పెంచడం జరిగింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ లను కూడా ప్రభుత్వం భారీగా విస్తరించింది. ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ 9 ఏoడ్లలో రూ.97,321 కోట్లను వ్యయం చేసింది. రాష్ట్ర సర్వతముఖాభివృద్ధికి దోహదపడే వర్గాలకు ఊతంగ నిలిచేoదుకు భారీ ఎత్తున విద్యుత్ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గృహ, ఉపాధి, వ్యవసాయ రంగాలకు చెందిన 72 లక్షల 41 వేల మంది వినియోదారుల కు సరఫరా చేసిన విద్యుత్ పైన రూ.50 వేల కోట్ల పైబడి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. రైతులు, వివిధ అల్పాదాయ వర్గాల ఆర్థికాభివృద్ధికి , జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి సబ్సిడీ పైన ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ ఊతంగా నిలుస్తున్నది. మొత్తం 27 లక్షల 48 వేల 598 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నది.
అల్పాదాయ, బడుగు బలహీనవర్గాలకు విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. నెలకు 0-50 యూనిట్స్ విద్యుత్ వినియోగించే గృహ వినియోగ దారు లు 35 లక్షల 61 వేల 809 కుటుంబాలు, నెలకు 101 యూనిట్స్ లోపు విద్యుత్ వాడుతున్న లక్షల 25 వేల 433 షెడ్యుల్ కులాల వినియోగదారులు , 2 లక్షల 95 వేల 114 మంది షెడ్యుల్ తెగల వినియోగదారులు ప్రభుత్వ నిర్ణయంతో లబ్దిపొందుతున్నరు. అలాగే నెలకు 250 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న 6494 మంది పౌల్ట్రీ ఫార్మ్ దారు లు, 32,654 హెయిర్ కటింగ్ సెలూన్ దారులు, 65,806 లాండ్రీ షాపుల వారు, 56 దోభి ఘాట్స్ లబ్దిదారు లు విద్యుత్ సబ్సిడీ ప్రయోజనం పొందుతున్నారు. వీరితో పాటు 5011 మంది పవర్ లూమ్ లకు, 39 స్పిన్నింగ్ మిల్స్ కు సబ్సిడీ పైన ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్న ది. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ తో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు లభించాయి.’ అని విద్యుత్ శాఖ తెలిపింది.