Tarun Chugh: ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్.. తరుణ చుగ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarun Chugh: ప్రశ్నించిన బండి సంజయ్ ను జైల్లో పెట్టారని తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర ఇంచార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతో అయినా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అత్యాచారాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఏది కూడా నెరవేర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందన్నారు. కేసీఆర్ సర్కార్ ను వైట్ వాష్ చేసి పంపిస్తారని తెలిపారు. నువ్ ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి? అని ప్రశ్నించారు. కేసీఆర్ ది సిగ్గు, శరం లేని ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు ఏది కేసీఆర్? ఎందరికి ఇచ్చావు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను కేసీఆర్ ప్రభుత్వం అత్యాచారం చేస్తోందన్నారు. కేసీఆర్ ఒక రాజాబాబు అంటూ వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారు? ప్రశ్నించిన బండి సంజయ్ ను జైల్లో పెట్టారంటూ తీవ్రంగా మండిపడ్డారు. యువత గురించి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. నిరుద్యోగులకు, యువతకు అండగా మేముంటామని తరుణ్ చుగ్ అన్నారు. 10 ఏండ్లుగా యువతకు అన్యాయం జరిగింది తప్పితే న్యాయం మాత్రం జరగలేదని అన్నారు. దేశంలో ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ లో ఉందని ఆరోపించారు. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. కేసీఆర్ సర్కార్.. బై.. బై.. అంటూ తరుణు చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
DK Aruna: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!