తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ మరియు డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గత సంవత్సరం జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన సంఘం తెలిసిందే.ఈ మేరకు మంత్రి వర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయం తీసుకుంది.బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన టెట్ ను సంవత్సరానికి ఒకసారి కూడా నిర్వహించడం లేదు. అయితే త్వరలో టీచర్ రిక్రూట్ మెంట్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించనున్నారు . టెట్ తర్వాతనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.నేడు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ఈ క్యాబినెట్ సమావేశంలో విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు.
విద్యా శాఖ లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ అలాగే మన ఊరు-మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది.. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి మరియు జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని అయితే నిర్ణయించింది. ఇక టెట్ లో గత ఏడాది కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం అయితే ఉండేది. డీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 1 ను రాసుకునే వారు.. కానీ గత సంవత్సరం నిర్వహించిన టెట్ పరీక్షలో బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 ను రాయడం జరిగింది.జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించే టెట్ కూడా బీఈడీ అభ్యర్థులు రెండు పేపర్లు రాసుకోవచ్చు