Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక చిత్రపటంలో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా క్రీడలు, పర్యాటక రంగాలు రెండింటినీ మిళితం చేస్తూ తెలంగాణను “గోల్ఫ్ టూరిజం హబ్”గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రపంచస్థాయి కోర్సుల నిర్మాణం..
హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ గోల్ఫ్ కోర్సును నిర్మించనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులను, పర్యాటకులను ఆకట్టుకునేలా దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేయనున్నారు.
Also Read
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
దీంతోపాటు, ప్రకృతి అందాలకు నిలయమైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల వద్ద మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సును అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో ఈ రెండింటిని నిర్మించి, పర్యాటకులకు ఉన్నత స్థాయి వసతులను కల్పించనున్నారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా కపిల్ దేవ్..
ఈ భారీ ప్రాజెక్టులతో పాటు తెలంగాణ పర్యాటక , క్రీడారంగాలను ప్రపంచస్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రముఖ భారతీయ క్రికెట్ దిగ్గజం, గోల్ఫ్ క్రీడాభిమాని కపిల్ దేవ్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకున్న ప్రపంచవ్యాప్త గుర్తింపు ద్వారా విదేశీ పర్యాటకులను, పెట్టుబడిదారులను తెలంగాణ వైపు ఆకర్షించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.
క్రీడా పర్యాటకానికి కొత్త ఊపిరి..
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి కేవలం పర్యాటక ఆదాయం మాత్రమే కాకుండా, స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విదేశీ పర్యాటకుల రాకతో హోటల్, రవాణా రంగాలకు కూడా మహర్దశ పడుతుంది. ప్రకృతి సౌందర్యం, ఆధునిక క్రీడా వసతుల మేళవింపుతో తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!