Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!
- తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు విడుదల
- మే 1నుంచి మే 31 వరకు బదిలీలకు అవకాశం
- 01-01-2026 నాటికి ఒకే స్థానంలో కనీసం 3 సంవత్సరాలు పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు
- భార్య/భర్త కారణాలతో బదిలీ కోరే వారికి 3 సంవత్సరాల షరతు నుంచి మినహాయింపు
- 31-12-2025 నాటికి ఒకే చోట 4 సంవత్సరాలు పూర్తి చేసినవారిని తప్పనిసరిగా బదిలీ
- 4 సంవత్సరాలకు పైగా కొనసాగించరాదని స్పష్టం
- 31-05-2027 లోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Employee Transfers: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు పనిచేసిన కాలం, వ్యక్తిగత పరిస్థితులు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మే 1నుంచి మే 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 01-01-2026 నాటికి ఓ నిర్దిష్ట స్థానంలో కనీసం మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. అయితే జీవిత భాగస్వామి కారణాలతో బదిలీ కోరే ఉద్యోగులకు ఈ మూడు సంవత్సరాల షరతు వర్తించదు. వారికి ప్రత్యేక సడలింపు ఇవ్వబడింది.
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
Also Read
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
అదేవిధంగా 31-12-2025 నాటికి ఒకే స్థానంలో నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించారు. 31-05-2027 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పటికీ, వారు స్వయంగా బదిలీ కోరితే తప్ప వారిని బదిలీ చేయరాదు.

Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!
ఇక పరిపాలనలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఒకే కేడర్‌లో 40% కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలతో బదిలీ ప్రక్రియను సమతుల్యంగా నిర్వహించాలనే ఉద్దేశం ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్గదర్శకాలతో ఉద్యోగుల బదిలీలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉండనుంది.
తాజావార్తలు
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!