Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!
- నోవక్ జకోవిచ్ (Novak Djokovic) ఆసక్తికర వ్యాఖ్యలు
- క్రికెట్‌పై ఆసక్తి పెరగడానికి విరాట్ కోహ్లీ కారణమని వ్యాఖ్య
- కోహ్లీ తనకు మంచి స్నేహితుడు
- ఇద్దరూ తరచూ టచ్‌లో ఉంటాము
- ముందు క్రికెట్‌పై ఆసక్తి లేకపోయినా, కోహ్లీతో పరిచయం తర్వాత ఫాలో అవుతున్నా
- త్వరలో భారత్‌కు రావాలని ఉంది
- భారత్ లో కోహ్లీతో కలిసి ఈవెంట్‌లో పాల్గొనాలి
- టెన్నిస్, క్రికెట్ ఆడి అభిమానులతో గడపాలని ఆకాంక్ష
- భారత అభిమానులపై ప్రత్యేక ప్రేమ, గౌరవం వ్యక్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic: ప్రపంచ టెన్నిస్ దిగ్గజ ఆటగాల్లో ఒకరైన నోవక్ జకోవిచ్ (Novak Djokovic) ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రపంచ దేశాలతో పాటు ఆయనకు భారత్ లో కూడా కోట్ల మంది అభిమానులున్నారు. నోవక్ జకోవిచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మంచి మిత్రుడని చాలా మందికి తెలియదు. తాజాగా వారిమధ్య ఉన్న స్నేహంపై జకోవిచ్ ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మాడ్రిడ్ లో జరిగిన లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ (Laureus World Sports Awards) సందర్భంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో జోకోవిచ్ ఈ విషయాలను తెలిపారు. జోకోవిచ్ మాట్లాడుతూ.. “విరాట్ నా మంచి మిత్రుడు. నేను అతన్ని చాలా గౌరవిస్తాను. నిజం చెప్పాలంటే.. అతని వల్లే నేను క్రికెట్ ను ఫాలో కావడం ప్రారంభించాను. ముందుగా క్రికెట్ పై అంతగా నాకు ఆసక్తి ఉండేది కాదు. కానీ కోహ్లీతో పరిచయం తర్వాత క్రికెట్ ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను. మేమిద్దరం ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాం” అని అన్నారు.
అలాగే తాను భారత్‌కు రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని.. “నేను భారత్ కు వచ్చినప్పుడు కోహ్లీతో కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొనాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించాడు. కొంచెం టెన్నిస్, కొంచెం క్రికెట్ ఆడి అభిమానులతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతేకాదండోయ్.. భారత అభిమానులపై కూడా జోకోవిచ్ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇండియన్ టెన్నిస్ అభిమానులు, స్పోర్ట్స్ ఫ్యాన్స్ నుంచి నాకు ఎన్నో సంవత్సరాలుగా మద్దతు లభిస్తోందని.. వారికి నా ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది. త్వరలోనే భారత్‌కు వస్తానని భారత అభిమానులకు హామీ ఇచ్చారు.
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!
నోవక్ జకోవిచ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో సెర్బియా తరఫున పాల్గొనాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఒలింపిక్స్‌లో నా దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం కన్నా గొప్ప గౌరవం ఇంకొకటి లేదని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆటలో తన ప్రత్యర్థులపై మాట్లాడిన జోకోవిచ్.. జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్ మధ్య పోటీ గొప్పదే అయినప్పటికీ.. తనకు మాత్రం రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ తో ఉన్న ఆటలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..