DGP Jitender Reddy: తెలంగాణలో పోలీసుల్లో తిరుగుబాటు స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బెటాలియన్ పోలీసులు సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే స్పెషల్ పోలీసుల ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. పోలీస్ బెటాలియన్స్‌లో ఆందోళన చేసినవారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. మళ్లీ ఆందోళనలకు దిగడంపై పోలీస్‌శాఖ సీరియస్ అయ్యింది. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించమని డీజీపీ తెలిపారు.
AP Government: ధరల నియంత్రణపై ఫోకస్.. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
అంతేకాకుండా.. శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని అనుమానం ఉందని డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు. క్రమశిక్షణగల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదని, ఎంతో కాలం నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని డీజీపీ అన్నారు. మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ వ్యవస్థనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఆందోళనలు చేసినవారిపై రెండు చట్టాల ప్రకారం చర్యలకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనే అని డీజీపీ తెలిపారు.
Kamakshi Bhaskarla : గ్లామర్ గేట్లు ఎత్తేసిన పొలిమేర-2 హీరోయిన్ ‘కామాక్షి భాస్కర్ల’