CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం జరిగింది. గాంధీ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఏడాది పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాల ప్రగతి వంటి ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
పీఏసీ సమావేశానికి ముందుగా, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర సభ్యులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
RTI Activist Petition: అలీఘర్ దేవాలయ స్థలంలో మసీద్ నిర్మించారంటూ కోర్టులో పిటిషన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రను గుర్తుచేసుకుంటూ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే, పాతబస్తీలో నిర్మించిన కొత్త ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరును పెట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
జనవరి 26నుంచి ప్రారంభమవుతుందని, రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు అందించనున్నట్లు వెల్లడించారు. రూ.21 వేల కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేసినట్లు వివరించారు. ప్రతి రైతు కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇందుకు సంబంధించిన వ్యయంగా రూ.4 వేల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నందున, పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశం కాంగ్రెస్ పాలనపై సమగ్ర సమీక్ష చేయడంతో పాటు, భవిష్యత్తులో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది.
Maharashtra: మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. పెళ్లి భోజనంలో విషం కలిపిన వ్యక్తి..