NTV Telugu Site icon

TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..

Tg Mp's

Tg Mp's

ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు. పదేళ్ళలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రులను కలిసిందిలేదు.. తీసుకొచ్చింది లేదని ఆరోపించారు. తమ పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారని ఎంపీ అనిల్ కుమార్ అన్నారు. 2026లో “ఖేలో ఇండియా” తెలంగాణలో జరగబోతున్నాయన్నారు. కేటీఆర్ భజన మండలి 10 ఏళ్లలో కేంద్రం నుంచి ఏమి తెచ్చిందో చెప్పాలని పేర్కొన్నారు. కేటీఆర్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆరోపించారు.

Read Also: BachhalaMalliTeaser : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.

ఎంపీ కావ్య మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్ ప్రజల కల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వచ్చి ప్రధానిని కోరారని ఎంపీ కావ్య అన్నారు. రేవంత్ రెడ్డి కృషివల్లనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది.. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారని పేర్కొన్నారు. తొలుత రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రం ఇచ్చారు.. తర్వాత దాన్ని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు పూర్తిగా “వందే భారత్ కోచ్” లు కూడా తయారుచేసేలా ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంపీ తెలిపారు. ఇందుకు మరో 200 ఎకరాల స్థలం కావాలని కేంద్రం కోరింది.. రాష్ట్రం సిద్ధంగా ఉందని అన్నారు.

Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్ విభజన హామీగా ఉన్న కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్రంపై ఒత్తిడి చేయలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేంద్రం వెంటపడి సాధించారు.. అందుకే 28 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. ఎంపీ రఘురామ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమస్యలపై బీజేపీ ఎంపీలను కలుపుకొని వెళతాం, తప్పేమీ లేదని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు అయ్యాక అభివృద్ధే తమ లక్ష్యం అని తెలిపారు. బీజేపీ ఎంపీల సహాయం ఖచ్చితంగా తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమకు సమస్యేమీ లేదని.. రాష్ట్ర అవసరాల కోసం నిరభ్యంతరంగా రమ్మని స్వయంగా రాజ్‌నాథ్ సింగ్ అన్నారని ఎంపీ రఘురామ రెడ్డి తెలిపారు.