CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు
- చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు
- జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిచి రాయలసీమ లిఫ్ట్‌కి అనుమతిచ్చింది కేసీఆర్ కాదా.?
- కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదు
- కట్టుడు.. కూల్చుడు అయ్యింది
- కేసీఆర్ కుటుంబానికి అంత బరితెగింపు ఎందుకో..? : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను ఓడించి, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందీ తానేనని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తిగా ఓటమి దక్కిందంటే, దానికి కారణం తానేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. “స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?” అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాక, కేసీఆర్ అసెంబ్లీలో వర్చస్సు చూపే స్థాయిలో లేరని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌కు ఎలాంటి భయం లేదన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్, “క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. భయపడితే క్రైమ్ చేయరు. అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడటమే అనవసరమని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్, “కిషన్ రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు. అసలు కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తెచ్చే ఉంటే, తానే స్వయంగా సన్మానిస్తానని సీఎం స్పష్టం చేశారు.
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
“కనీసం అఖిలపక్ష సమావేశానికి కూడా కిషన్ రెడ్డి రాలేదు. కేంద్రం నుంచి నిధులు తెస్తే తాము తిరస్కరించమా? రింగ్ రోడ్డు అంటే పూర్తి వలయాకారంలో ఉండాలి. కానీ సగం ఇచ్చి దాన్ని రింగ్ రోడ్డంటూ ఎలా అంటారని?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా, బీజేపీ నేతలు హాజరుకాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై భయంతోనే కిషన్ రెడ్డి సమావేశానికి రాలేదేమోనని ఎద్దేవా చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడంలో బీజేపీ వైఫల్యం చెందిందని ఆరోపించిన సీఎం రేవంత్, “బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు ఇచ్చారు. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?” అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ చెల్లించే పన్నులతో పోల్చితే, కేంద్రం నుంచి రాబడే నిధులు ఎంత తక్కువగా ఉన్నాయో ప్రజలకు అర్థమయ్యేలా చర్చకు రావాలని సవాల్ విసిరారు. “కిషన్ రెడ్డికి ధైర్యముంటే ఈ అంశంపై చర్చకు రావాలి. నేను సీఎం భట్టి విక్రమార్క్‌తో సహా చర్చకు సిద్ధమే” అని ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్లేందుకు తాను వెనుకాడనని స్పష్టం చేశారు. “ఢిల్లీ వెళ్లడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన అనుమతులు రావడానికి సహాయపడింది” అని రేవంత్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీకి కూడా దిగకుండా తప్పించుకున్నది బీఆర్ఎస్ కాదా?” అని రేవంత్ ప్రశ్నించారు. హరీశ్ రావు లాంటి నేతలు రాజకీయంగా తప్పించుకునేందుకు దొంగ దెబ్బ తీశారని విమర్శించారు. మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను బీజేపీ వ్యాఖ్యలతో పోల్చుతూ, రెండు ఒకటేనని కొట్టిపడేశారు. ఏపీలో వర్గీకరణ సమస్యపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదని తిప్పికొట్టారు. SLBC ప్రాజెక్టును గతంలోనే పూర్తి చేసి ఉంటే, కొండపల్లి ఘటనలో ప్రాణనష్టం జరిగేది కాదని రేవంత్ అన్నారు. అంతేకాకుండా, ప్రజల మరణాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆయన ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
తాజావార్తలు
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!