CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచాలని ఈసీని కోరారు. రాష్ట్రంలో దాదాపు 73.39 లక్షల మంది (అంటే మొత్తం ఓటర్లలో 21.7%) ‘అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్’ (ASDD) జాబితాలోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్రాఫ్ట్ రోల్లో రకరకాల లోపాలు, మ్యాపింగ్ లేకపోవడం వల్ల సగానికి పైగా ఓటర్లు మళ్లీ తమ అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మొత్తంగా 92.86 లక్షల మందికి నోటీసులు అందాయని పేర్కొన్నారు. నమోదైన మొత్తం ASDD కేసుల్లో ఒక్క హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 58.6% కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును పరిరక్షించేందుకు ఆక్షేపణలు, ఫిర్యాదుల సమర్పణ గడువును ప్రస్తుతం ఉన్న సెప్టెంబర్ 16 నుంచి మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని సీఎం కోరారు. ఓటర్లకు నోటీసులు అందిన తర్వాత దానికి తగిన ఆధారాలతో సమాధానం ఇచ్చేందుకు కనీసం 3 నుంచి 4 వారాల వ్యవధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కు పరిస్థితి తెలిసేలా గ్రామసభలు, పురపాలక వార్డుల్లో కనీసం రెండుసార్లు ఓటర్ల జాబితాను బిగ్గరగా చదివి వినిపించాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో అర్హులైన ఓటర్లకు సహాయపడటానికి పోలింగ్ బూత్ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఓటర్లు సులభంగా పొందేలా మండల స్థాయిలో లభించే అధికారిక పత్రాలను కూడా సవరణల ధ్రువీకరణ కోసం ఆమోదించాలని లేఖలో ప్రస్తావించారు. విచారణల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అదనంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను (ERO) నియమించి, విచారణ సమయాన్ని ఓటర్ల సదుపాయానికి అనుగుణంగా వికేంద్రీకరించాలని లేఖలో స్పష్టం చేశారు.
Also Read
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!