NTV Telugu Site icon

CM Revanth Reddy : ముగిసిన ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలివే..!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు.

ప్రధాన అంశాలు:

హైదరాబాద్ మెట్రో & ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు:

హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు విస్తరణ కోసం రూ. 24,269 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి.
రంగారెడ్డి రింగ్ రోడ్డు (RRR) అభివృద్ధికి మద్దతు కోరారు.

మూసీ నది పునరుద్ధరణ:

55 కిలోమీటర్ల మేర విస్తరించిన మూసీ నదికి పునర్జీవం ఇవ్వడం రాష్ట్ర ప్రాధాన్య లక్ష్యమని వివరించారు.
మూసీ ప్రాజెక్టుకు రూ. 20,000 కోట్లు మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు.

ఐపీఎస్ అధికారుల కొరత:

తెలంగాణలో 29 మంది ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు.
ఈ ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి:

తెలంగాణను సెమీ కండక్టర్ మిషన్ & అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని కేంద్రం సహకారం కోరారు.

పెండింగ్ ప్రాజెక్టులు & విభజన సమస్యలు:

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాల నివేదికను ప్రధానికి సమర్పించారు.
విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి.

ప్రధాని స్పందన & భవిష్యత్ చర్యలు

ఈ భేటీలో గత పదేళ్లలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ప్రధానమంత్రి కూడా వివరాలను సీఎం రేవంత్‌కు ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం గురించి మోదీకి వివరించారు. పలు కేంద్రమంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నేతలు కూడా హాజరయ్యారు. ఈ భేటీ తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారనుంది.

Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌‌పై అన్నామలై ఆగ్రహం..