Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో సమావేశం అవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయాలపై ప్రస్తావించారు. ఫలితంగా, కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు. ప్రధాన అంశాలు: హైదరాబాద్ మెట్రో & ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు: హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు విస్తరణ కోసం రూ. 24,269 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి. రంగారెడ్డి రింగ్ రోడ్డు (RRR) అభివృద్ధికి…
రైతు ఏ కారణం చేత మరణించినా 10 రోజులలో రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రంలో ప్రభుత్వ ఉచిత చేపల పంపిణీలో భాగంగా రొయ్యలు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు…