NTV Telugu Site icon

Caste Census : ముగిసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం.. బీసీ జనాభా 46 శాతంగా తేల్చిన సర్వే..?

Caste Census

Caste Census

Caste Census : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీ కి అందజేశారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ నివేదికను సమర్పించింది. ఈ సమావేశం సచివాలయంలో నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే దాదాపు 50 రోజుల పాటు కొనసాగింది. ఇందులో రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సంబంధిత వివరాలను సేకరించడం జరిగింది. మొత్తం 3,889 మంది అధికారులు ఈ సర్వే నిర్వహణలో పాల్గొన్నారు. 96.9% కుటుంబాలను సమీక్షించి, 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే, 3.1% మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదని కమిషన్ నివేదికలో పేర్కొంది. అయితే ఈ సర్వేలో బీసీ జనాభా 46 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

liver Benefits: మటన్,చికెన్ లివర్ తింటున్నారా ? అయితే జాగ్రత్త

ఈ నివేదికపై సోమవారం కేబినెట్ సబ్ కమిటీలో చర్చించనున్నారు. ఆమోదం పొందిన అనంతరం, ఈ నెల 5న ఉదయం జరిగే కేబినెట్ సమావేశంలో సమర్పించనున్నారు. అక్కడ ఆమోదించిన తర్వాత, అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం, అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించి, తుది ఆమోదం పొందనుంది.

కులగణన సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన దిశగా వినియోగించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక త్వరలో నిర్వహించబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

YSRCP: ఎన్నికల కమిషనర్‌ని కలిసిన వైసీపీ నేతలు..