NTV Telugu Site icon

CM Revanth Reddy : మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కొత్త సభ్యులను చేరుస్తారా లేదా కొందరిని తప్పిస్తారా అన్న విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దే అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కేసులను చట్ట ప్రకారం ముందుకు తీసుకెళతామని తెలిపారు. తాను సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. కుల గణనను సమగ్రంగా, పకడ్బందీగా నిర్వహించామని సీఎం తెలిపారు. అలాగే, పీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ అవసరం లేదని, ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

 Rare Treatment : భళారే.. పురుషాంగాన్ని యువకుడి చేతిపై పుట్టించిన హైదరాబాద్‌ వైద్యులు..

డిసెంబర్ 7, 2023న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం 11 మందిని మాత్రమే తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అప్పట్లో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం ప్రకటించినా, ఏడాది గడిచినా దానిని అమలు చేయలేదు. మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు అసమ్మతి గళం వినిపించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీలో “ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉండదని” ప్రకటించడాన్ని రాజకీయంగా కీలకంగా భావిస్తున్నారు.

కేబినెట్ విస్తరణ పూర్తయితే చోటు దక్కని నేతలు అసంతృప్తికి గురవుతారని, వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే విస్తరణను ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల పది మంది ఎమ్మెల్యేల గోప్య సమావేశం, ఢిల్లీలో జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు వంటి పరిణామాల కారణంగా పార్టీ హైకమాండ్ ఎలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరింత ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.

Nagarjuna : ప్రధాని మోడీని కలిసిన నాగార్జున కుటుంబం.. ఎందుకంటే ?