Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddam Prasad: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. అసెంబ్లీ ముట్టడి, అధికారులపై దాడులు, స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయనను పరామర్శించారు. ఇక, సోమవారం అసెంబ్లీ తొలిరోజే బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాసనసభ ప్రాంగణంలో విధుల్లో ఉన్న అధికారులపై బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు దిగడమే కాకుండా, మహిళా అధికారుల ముందే చొక్కాలు విప్పుకొని అసభ్యకరంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరకర పదజాలంతో దూషించారని పాలకపక్షం మండిపడింది. అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలోనే కంటతడి పెట్టుకున్నారు.
అసెంబ్లీ చరిత్రలోనే ఇదొక బ్లాక్ డేగా మారుతుందని, స్పీకర్‌ను అవమానించడం అంటే మొత్తం తెలంగాణ సమాజాన్ని, దళిత వర్గాలను అవమానించడమేనని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ భావోద్వేగానికి గురైన దృశ్యాలు చూసి తీవ్ర ఆవేదన చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు తమ పూర్తి మద్దతు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి భంగం కలిగించేలా వ్యవహరించిన ఎంతటి వారికైనా సరే ప్రభుత్వం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రభుత్వం ఆయనకు అండగా నిలుస్తుందని స్పీకర్‌కి సీఎం హామీ ఇచ్చారు.
Also Read
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!