RTI Commissioners: తెలంగాణ రాష్ట్రంలో సమాచారం హక్కు చట్టం (RTI) అమలుకు సంబంధించి కీలక పాత్ర పోషించే సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్ లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరు తలపట్టిన ఈ పదవి మూడేళ్ల కాలానికి ఉంటుంది.
Read Also: Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్ లాంచ్..!
ఈ నేపథ్యంలో నేడు (మే 14) సచివాలయంలో నలుగురు నూతన సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, దేశాల భూపాల్, అయోధ్యరెడ్డి ఒక్కొక్కరుగా రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నియామకంతో సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి వచ్చాయి. పారదర్శక పరిపాలనకు బలంగా నిలిచే సమాచారం కమిషన్ పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also: Uppal Bhagayat: పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..!