Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమగ్ర కులగణన ఇంటింటి సర్వే అవగాహన సదస్సుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు కులగణన గత ఎన్నికల్లో పిలుపునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగనన చేపడుతామని హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు. మూడు నెలల్లో హై కోర్టు కులగణన నివేదిక సమర్పిస్తామని, అన్ని వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఆది శ్రీనివాస్. రాష్ట్రంలోని 80 వేల అధికారులతో సర్వే చేస్తున్నామని, 50 ప్రశ్నలతో ఒక్క అధికారికి 150 ఇల్లులు చొప్పున కేటాయిస్తున్నామన్నారు.
US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?
గ్రామాల్లో ఉన్న మన నాయకులు 150 ఇండ్లు సెలెక్ట్ చేసి ఆ అధికారికి అందివ్వాలని, ప్రతిక్కరు పాల్గొని పండుగ వాతావరణంలో కుల గణన జరుగాలన్నారు ఆది శ్రీనివాస్. కుల గణన ఆధారంగా రానున్న ఎన్నికలు జరుగనున్నాయని, రాజకీయాలకతీతంగా కుల గణన చేస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రోజు 16 వేల కోట్ల నిల్వవతో సోనియమ్మ ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 60 వేల కోట్లు కు అప్పుడు సంవత్సరానికి 6 వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టేదని, గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు కడుతున్న మిత్తి నెలకు 6 వేల కోట్ల రూపాయలు అని ఆయన వెల్లడించారు. రైతు రుణమాఫీ మొదటి, రెండో విడుత లో 36 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని, ఆధార్ కార్డులో తప్పుడు ఉండడం వలన కొందరి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు త్వరలో వారికి కూడా రుణ మాఫీ చేస్తామన్నారు ఆది శ్రీనివాస్.
Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ