బాంగ్ బ్యాంగ్… వార్… పఠాన్ లాంటి హై ఆక్టేన్ యాక్షన్ సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుంది అంటే ఒక సాలిడ్ యాక్షన్ఎంటర్టైనర్… ప్రాపర్ కమర్షియల్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్ కి వెళ్తే ఎంజాయ్ చేసి వస్తాం అనే నమ్మకం బాలీవుడ్ ఆడియన్స్ లో ఉంది. పఠాన్ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ని రివైవ్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్… ఇటీవలే హ్రితిక్ రోషన్ తో కలిసి ఫైటర్ సినిమా చేసాడు. దీపికా, అనిల్ కపూర్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ రిపబ్లిక్ డే సంధర్భంగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఫైటర్ సినిమాని మొదటి మండేకే ఆడియన్స్ కంప్లీట్ గా రిజెక్ట్ చేసారు. బ్రేక్ ఈవెన్ మార్క్ కి చేరువలో ఉన్న ఈ సినిమా బయ్యర్స్ కి భారీ లాభాలని అయితే తెచ్చిపెట్టే అవకాశం కనిపించట్లేదు. ఈ మూవీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ గా మారాయి.
“ఫైటర్ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్… ఇండియాలో 90% మంది అసలు ఫ్లైట్ ఎక్కలేదు, కనీసం పాస్ పోర్ట్ కూడా లేని వాళ్లు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఫ్లైట్ కూడా ఎక్కని వాళ్లకి ఏరియల్ యాక్షన్ సినిమా చూపిస్తే అది ఏలియన్ సినిమా అనుకోని ఉంటారు. ఈ కారణంగానే నా సినిమా ఆడలేదు” అంటూ సిద్ధార్థ్ ఆనంద్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో సిద్దార్థ్ ఆనంద్ ని విమర్శల పాలు చేస్తుంది. అవతార్, అనిమల్, సలార్, పఠాన్ సినిమాలు చేసినప్పుడు ఆడియన్స్ ఆ కథల్లో నిజంగా జీవించినట్లు కాదు. సినిమా కథ ఏదైనా సరే ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా కథని చెప్పడం గొప్ప విషయం, అందులో సిద్ధర్థ్ ఆనంద్ ఫెయిల్ అయ్యి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒక డైరెక్టర్ ఇలాంటి కామెంట్స్ చేసే ముందు కాస్త ఆలోచించాలి అప్పుడే విమర్శలు ఫేస్ చేయకుండా ఉంటారు.