Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Teen Dies By Suicide In Nagpur Had Searched What Happens After Death Online

Shocking: “చావు తర్వాత ఏం జరుగుతుంది”.. టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య..

Published Date :January 28, 2025 , 4:56 pm
By Venu Goapl Reddy
  • చావు తర్వాత ఏం జరుగుతుందని సెర్చ్..
  • మణికట్టు, గొంతు కోసుకుని టీనేజ్ అమ్మాయి సూసైడ్..
Shocking: “చావు తర్వాత ఏం జరుగుతుంది”.. టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది..?’’ అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిందని పోలీసులు మంగళవారం తెలిపారు. నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న బాధితురాలు, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కూతురు. ఆమె మరణం, విదేశీ సంస్కృతుల గురించి తరుచుగా సెర్చ్ చేస్తుందని వారు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ‘స్టోన్ బ్లేడ్ కత్తి’తో తన మణికట్టుపై కోసుకుని, అడ్డంగా గీతలు పెట్టుకుంది, ఆ తర్వాత తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Sam Pitroda: ‘‘అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్‌లోకి రానివ్వండి’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడి వ్యాఖ్యలు..

ఆమె తల్లి సోమవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఛత్రపతి నగర్ ప్రాంతంలోని తన ఇంట్లోని బెడ్‌రూంలో పడి ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు అమ్మాయి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ‘‘మరణం తర్వాత ఏమి జరుగుతుంది.??’’ అని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బాలిక తన డైరీలో విదేశీ సంస్కృతుల గురించి విస్తృతంగా రాసిందని పోలీసులు గుర్తించారు. అమ్మాయికి యూరోపియన్ కల్చర్‌పై ఆస్తి ఉందని, కొంతకాలంగా మరణంపై పరిశోధన చేస్తోందని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అమ్మాయి తన మణికట్టుపై 5 కోతలు పెట్టుకున్నట్లు, ఇందులో రెండు క్రాస్ మార్క్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఆ అమ్మాయి ఆన్‌లైన్ గేమింగ్‌కి బానిస అయిందని దర్యాప్తులో తేలినట్లు అధికారి తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి వారి ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుండగా, మొదటి అంతస్తులో ఆమె మామ కుటుంబం, అమ్మమ్మ ఉంటున్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసుని నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nagpur
  • suicide
  • Teen dies by suicide

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions