TECNO Spark Go 2: బడ్జెట్ ఫోన్ విభాగంలో టెక్నో కంపెనీ మరో కొత్త మోడల్‌ను భారత మొబైల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన ‘Spark Go’ మోడల్ కు అప్డేటెడ్ గా వచ్చిన ఈ TECNO Spark Go 2 ధర కేవలం రూ. 6,999 మాత్రమే ఉన్నా, మొబైల్ లో అందించే ఫీచర్లు వింటే మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలశ్యం ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దామా..
డిస్ప్లే:
ఈ ఫోన్ లో 6.67 అంగుళాల HD+ డాట్-ఇన్ డిస్ప్లేను పొందుపరిచారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల మొబైల్ పై స్క్రోల్ చేయడం, గేమింగ్ ఆడడం మరింత మృదువుగా ఉంటుంది.
Read Also:Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!
ప్రాసెసర్:
దీంట్లో డైనమిక్ పోర్ట్ అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా ఐఫోన్ లాగా నోటిఫికేషన్ లను పొందవచ్చు. ఇక మొబైల్ ప్రాసెసింగ్ కోసం UniSoC T7250 చిప్ సెట్ ను ఉపయోగించబడింది. దీనికి తోడుగా 4GB RAMతో పాటు మరో 4GB వర్చువల్ RAM ఉండడంతో మల్టీటాస్కింగ్ సజావుగా సాగుతుంది. HiOS 15 ఆధారంగా Android 15 మీద నడిచే ఈ మొబైల్ కు నాలుగు సంవత్సరాల లాగ్-ఫ్రీ పనితీరు హామీ ఇస్తోంది కంపెనీ.
కెమెరా:
ఇక TECNO Spark Go 2 కెమెరా విషయానికొస్తే.. ఇందులో వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో, ముందు 8MP సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో మంచి ఫోటోలను అందనుంది.
Read Also:VIVO T4 Lite 5G: రూ.9,999 లకే ఇంత పవర్‌ఫుల్ ఫోన్ మరోటి ఉండదేమో.. వివో T4 లైట్ 5G మొబైల్ లాంచ్..!
బ్యాటరీ:
ఈ మొబైల్ లో 5000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. దీనికి కేవలం 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడింది. ఇది కాస్త మొబైల్ ఫీచర్స్ లో మైనస్ గా కనిపిస్తోంది.
ఇతర ఫీచర్స్:
* ‘No Network Communication’ ఫీచర్ ద్వారా మొబైల్ సిగ్నల్ లేకున్నా అత్యవసర ఫంక్షన్లు పనిచేయడం ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకత.
* IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, DTS స్టీరియో స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB టైపు-C పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
* అలాగే భారతీయ ప్రాంతీయ భాషల్లో స్పందించే Ella AI అసిస్టెంట్ ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ.
* ఈ మొబైల్ 165.6×77×8.25 మిల్లీమీటర్ల పరిమాణం, 186 గ్రాముల బరువు ఉంటుంది.
ధర:
TECNO Spark Go 2 మొబైల్ ఇంక్ బ్లాక్, టైటానియం గ్రే, వేల్ వైట్, టర్కాయిస్ గ్రీన్ అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. ఇక ధర విషయానికి వస్తే 4GB + 64GB మోడల్ ధర రూ. 6,999గా నిర్ణయించబడింది. జూలై 1 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు ఇంత ఎక్కువ ఫీచర్లను అందించడం వలన TECNO Spark Go 2 ఫోన్ బడ్జెట్ కస్టమర్లకు ఒక మంచి ఎంపికగా నిలవనుంది.